KAVITHAMMA
KOTLA KAVITHAMMA
కోడుమూరు/రూరల్: టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని మండల అధ్యక్షురాలు కోట్ల కవితమ్మ అన్నారు. టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పార్టీ పెద్దలు తనపై ఎంతో నమ్మకంతో మండల అధ్యక్ష పదవి ఇచ్చారని, పార్టీ అభివృద్ధికి పాటు పడతానని అన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు ఆకెపోగు ప్రభాకర్ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కేయి మల్లికార్జునగౌడ్, మాజీ సర్పంచు కేయి రాంబాబు, సీబీ లత, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, హేమాద్రిరెడ్డి, కేయి రాఘవేంద్రగౌడ్, ఆంద్రయ్య పాల్గొన్నారు. అంతకుముందు లద్దగిరి నుంచి బయ లుదేరిన ఆమె మందుగా గోరంట్ల లక్ష్మీ మాధవస్వామి ఆలయంలో, ఆ తర్వాత వెంకటగిరి గిడ్డాంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసి మొక్కులు చెల్లించారు.
Jai kotla jai kavithamma
ReplyDelete